ఫోన్ పే గుడ్ న్యూస్..ఉచితంగా రూ.5 లక్షలు..!

-

ఫోన్‌పే కస్టమర్స్ కి గుడ్ న్యూస్ ని అందించింది. నీతి ఆయోగ్‌తో ఫోన్‌పే జత కట్టింది. దీనిలో భాగంగా హ్యాకథాన్ నిర్వహించబోతోంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌‌లో మార్పులు తీసుకు రావాలని హ్యాకథాన్ తీసుకురానున్నారు. అయితే దీని వలన ఇన్నోవేటర్లకు, డిజిటల్ క్రియేటర్లకు, డెవలపర్లకు దీని వల్ల మంచి అవకాశం ఉంటుంది.

phonepe

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ హ్యాకథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి రూ.5 లక్షల వరకు ప్రైజ్ మనీ ని ఇస్తారు. విన్నింగ్ టీమ్‌కు రూ.1.5 లక్షలు లభిస్తాయి. రెండు, మూడు స్థానాల్లో వస్తే వరుసగా రూ.లక్ష, రూ.75 వేల చొప్పున అందజేస్తారు. అలానే ఇతరులకి కూడా ప్రైజ్‌లు ఉండొచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం వుంది.

ఎంట్రీస్ తుది గడవు ఫిబ్రవరి 25గా నిర్ణయించారు. విన్నర్లను ఫిబ్రవరి 28న ప్రకటిస్తారు. ఓపెన్ డేటా ఏపీఐలు ఉపయోగించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆర్థిక సేవలు తీసుకు రావాలని అనుకుంటున్నారు. అలానే రుణాలు, బీమా, ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన ప్రత్యామ్నాయ రిస్క్ మోడల్స్, ఆర్థిక సేవలను విస్తృతంగా వినియోగించేలా పవర్ డేటా సిగ్నల్స్‌ ఉపయోగించే వినూత్న ఉత్పత్తులు, డిజిటల్ చెల్లింపుల డేటా ఆధారంగా మెరుగైన విజువలైజేషన్, డెరైవ్డ్ ఇంటెలిజెన్స్ వంటివి హ్యాకథాన్‌ లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.

ఫోన్ పే పల్స్, ఓపెన్ గవర్నమెంట్ డాటా ప్లాట్ ఫామ్, పేమెంట్స్‌పై ఆర్‌బీఐ రిపోర్ట్‌లు వంటి వాటిని హ్యాకథాన్‌లో పాల్గొనే వారు ఉపయోగించచ్చు. సేతు ఏఏ శాండ్ బాక్స్ లేదా సేతు పేమెంట్స్ శాండ్ బాక్స్ ని వినియోగించి ద్వారా హ్యాక్స్‌ను డెవలప్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news