మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA) భారత ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులకు, జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2005లో చట్ట ప్రకారం ఆమోదించబడింది. గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజులు ఉపాధిని కల్పిస్తోంది. తెలంగాణలో ఈ పథకం కింద లక్షల మంది వ్యవసాయ కూలీలు, రైతులకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు వేతనాలు గురించి పూర్తి వివరాలు చూద్దాం..
ఈ పథకం ప్రధాన లక్ష్యం: గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశం.ఇక తెలంగాణలో ఈ పథకం కింద రోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెట్లు పెంచడం, పండ్ల తోటలను సాగు చేయడం వంటి పనులు చేపట్టారు. ఈ పనులు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాక కార్మికులకు కొంత ఆదాయాన్ని అందిస్తాయి. ఈ పథకం మహిళలకు కనీసం 50% ఉపాధి అవకాశాలని అందించి కేంద్రం ప్రోత్సహిస్తుంది. ఇక ఇంతే కాక పని స్థలంలో కూలీలకు తాగునీరు అందించడం, నీడ, ప్రాథమిక చికిత్స సౌకర్యాలను కల్పించబడతాయి. ఒక కార్మికుడు మరణిస్తే, కుటుంబానికి 50,000 ఎక్స్గ్రేషియా చెల్లించబడుతుంది.
తెలంగాణలో ఉపాధి హామీ పథకం: 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ఈ పథకం కింద రోజువారి వేతనాన్ని పెంచడం జరిగింది. ఈ వేతనం బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా కూలీలకు చెల్లించబడుతుంది దీనివల్ల అవినీతి తగ్గుతుంది. ఈ పథకం కింద రోజువారి వేతనం రూ.307 ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు పని స్థలంలో సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 తర్వాత పని కేటాయించాలని ఆదేశించింది.
తెలంగాణలో ఈ పథకం ద్వారా 56 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందుతున్నాయి. 2024 -25 లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,372 కోట్లతో ఐదు నెలల లో పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలి విడతలో రూ.6000 డిసెంబర్ 28, 2024న జమ చేశారు. ఈ పథకం ద్వారా 100 రోజుల పని పూర్తి చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలంగాణలో ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సామాజిక భద్రతను అందిస్తోంది. లక్షల మంది కార్మికులకు ఉపాధి మెరుగైన జీవన పరిమాణాలను కల్పిస్తూ గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుంది.