కూటమి ప్రభుత్వం 12 మాసాల్లో ఏం సాధించారని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సింగపూర్ వెళ్లి సాధించిందేంటో చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించింది దాచుకోవడానికి అన్ని సార్లు సింగపూర్ వెళ్లాడని పేర్కొన్నారు. 2014-19, ఈ 15 మాసాల మధ్య ఏ ఒక్క కార్యక్రమమైనా చెప్పుకోగలిగావా..? అని ప్రశ్నించారు.
ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు వైసీపీ హయాంలో 3 పోర్టుల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారని మండిపడ్డారు. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని.. చంద్రబాబు, లోకేష్ కి ఎప్పుడైనా అనిపించిందా..? అని ప్రశ్నించారు. ఆదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ హయాంలోనే ఆదార్ డేటా సెంటర్ వచ్చిందని తెలిపారు. బ్లూ ఎకానమీకి వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. విశాఖపట్టణంలో భూముల విషయం పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విశాఖలో లూలూ సంస్థకి ఇచ్చిన భూములను.. దేశంలో ఏ రాష్ట్రం కూడా అంతగా భూములు ఇవ్వలేదన్నారు.