విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు సాధారణంగా షార్ట్స్ ధరించి వెళ్తుంటారు. ప్రయాణంలో సౌకర్యంగా ఉంటుందని ఈ విధంగా చేస్తారు. అయితే మీకిది తెలుసా..? షార్ట్స్ ధరించి విమానా ప్రయాణాలు చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
షార్ట్స్ ఎందుకు వేసుకోకూడదంటే:
షార్ట్స్ వేసుకోవడం వల్ల సీట్ల మీద ఉండే సూక్ష్మజీవులు సులభంగా చర్మాన్ని తాకి ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చేతులు పెట్టుకునే ప్రదేశం, తల వెనక భాగంలోని ప్రదేశాల్లో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రదేశాలను ప్రతీ ప్యాసింజర్ టచ్ చేస్తాడు.
ముఖ్యంగా ఎక్కువ గంటలు విమాన ప్రయాణం చేసేవారు షార్ట్స్ ధరించకపోవడమే మంచిదని అంటున్నారు. ఫుల్ హాండ్స్ షర్ట్, ప్యాంటు వేసుకోవడం వల్ల సూక్ష్మజీవులు చర్మాన్ని తాకే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచిదని చెబుతున్నారు.
జనరల్ గా విమానాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. ఒకసారి ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శుభ్రం చేసేస్తారు. కాకపోతే కంప్లీట్ క్లీనింగ్ అనేది విమానాల్లో సాధ్యపడదని చెబుతున్నారు. ఈ కారణంగా షార్ట్స్ అవాయిడ్ చేయడమే మంచిదని సూచిస్తున్నారు.
మరీ ముఖ్యంగా అద్దం పక్కన సీట్లో కూర్చునే వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. సాధారణంగా పిల్లలు అద్దాన్ని టచ్ చేస్తూ ఉంటారు. అలా టచ్ చేసినప్పుడు సూక్ష్మజీవులు అద్దం మీద చేరుతాయి. ఆ తర్వాత మీరు ఫ్లైట్ ఎక్కి అద్దాన్ని టచ్ చేస్తే మీ చేతులకు సూక్ష్మజీవులు అంటుకుంటాయి.
మరో విషయం ఏంటంటే.. విమానాల్లో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు.. డైరెక్ట్ గా చేతులతో ఫ్లష్ ఆన్ చేయకుండా, నాప్కిన్ ని చేతికి అడ్డంగా పెట్టుకుని ఫ్లష్ ఆన్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.