గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు సమీపంలో ఉంది. కుంభల్ గర్ కోట వద్ద ఇది ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత అతి పెద్ద వాల్ ఇదే.
మీరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పేరు విన్నారా? వినే ఉంటారు.. అది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోడ కాబట్టి.. దాని గురించి వినే ఉంటారు. అందులోనూ అది ప్రపంచంలోని ఓ వింత. మరి… గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి విన్నారా ఎప్పుడైనా? ఎట్టెట్ట.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా కూడా ఉందా? అని నోరెళ్లబెట్టకండి. ఉంది.. కానీ.. దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. అందుకే.. ఇప్పుడు మనం ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం రండి…
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు సమీపంలో ఉంది. కుంభల్ గర్ కోట వద్ద ఇది ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత అతి పెద్ద వాల్ ఇదే.
దీన్ని రానా కుంభ అనే రాజు కట్టించారు. మేవర్ రాజు ఆయన. ఆ గోడ లోపల మొత్తం 360 గుళ్లు ఉంటాయి. చిట్టడవిలో నిర్మించిన ఈ గోడ కుంభల్ గర్ కోట చుట్టూ ఉంటుంది.
దీన్నే కుంభల్ గర్ గోడ అని కూడా పిలుస్తారు. కాకపోతే ఎక్కువగా ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. 15 మీటర్ల మందంతో ఈ గోడను నిర్మించారు. రాళ్లను అందంగా మలిచి ఈ గోడ నిర్మాణంలో వాటిని ఉపయోగించారు. దీంతో ఈ గోడ నుంచి నడుచుకుంటూ వెళ్లూ.. అందమైన నిర్మాణాన్ని ఆస్వాదించవచ్చు. దానితో పాటు.. గోడ చుట్టూ ఉన్న గుళ్లను దర్శించుకోవచ్చు. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదంచవచ్చు. అందుకే.. ఇది పర్యాటక ప్రాంతంగా వర్థిల్లుతోంది.