దీపావ‌ళికి ప్ర‌త్యేక రైళ్లు ఇవే..

-

దీపావళి పండగ రద్దీకి దృష్ట్యా గుంటూరు మీదగా 12 ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌ శనివారం ఒక ప్రకటించారు. నెంబరు. 07049 మచిలీపట్నం – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.55కి గుంటూరు, 5.40కి సత్తెనపల్లి, రాత్రి 7.34కి మిర్యాలగూడ, 8.05కి నల్గొండ, 10.10కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 07050 సికింద్రాబాద్‌ – మచిలీపట్నం ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం రాత్రి 11.55కి అర్ధరాత్రి దాటాక 1.25కి నల్గొండ, 1.55కి మిర్యాలగూడ, సోమవారం వేకుజవామున 4.25కి సత్తెనపల్లి, 5.40కి గుంటూరు, ఉదయం 8.55కి మచిలీపట్నం చేరుకొంటుంది.

నెంబరు. 07258 నరసాపూర్‌ – హైదరాబాద్‌ ప్రత్యేక రైలు నవంబరు నెలలో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గం టలకు గుంటూరు, 11.30కి సత్తెనపల్లి, అర్ధరాత్రి 12.01కి పిడుగురాళ్ల, 12.24కి నడికకుడి, 12.55కి మిర్యాలగూడ, 1.30కి నల్గొండ, సోమవారం వేకువజామున 3.55కి సికింద్రాబాద్‌, 4.45కి హైదరాబాద్‌ దక్కన్‌ (నాంపల్లి)కి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version