విశాఖ టు తిరుపతి టూర్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలని చూసి రావచ్చు..!

-

తిరుమల వెళ్లాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం ఎన్నో ప్యాకేజీలని తీసుకు వచ్చింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు కూడా ఇప్పటికే చాలా ప్యాకేజీలని తీసుకు వచ్చింది. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్ తిరుమల దర్శన్ అనే ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. వివరాలు చూస్తే.. ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది ఇది. కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, శ్రీకాళహస్తి కూడా ఈ ప్యాకేజీ తో వెళ్లి వచ్చెయ్యచ్చు.

 

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా ఈ ప్యాకీలో ఉంటుంది. వీకెండ్‌లో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని, అలానే అక్కడ ఇంకొన్ని ఆలయాలను కూడా ఈ టూర్ ప్యాకేజీ తో చూసి వచ్చేయచ్చు. ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి వుంది. రెండో రోజు ఉదయం 4.05 గంటలకు తిరుపతి రీచ్ అవుతారు. హోటల్‌లో ఫ్రెషప్ అయ్యాక కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాలకి వెళ్లి.

రాత్రికి తిరుపతిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం తిరుచానూర్, శ్రీకాళహస్తి చూసేసి… లంచ్ తర్వాత తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా శ్రీవారిని చూసి రావచ్చు. దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 8.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో ట్రైన్. నాలుగో రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం రీచ్ అవుతారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,375, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.13,250, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.10,280 పే చేయాలి. క్లాసు ని బట్టీ ధరలు ఉంటాయి. అలానే పూర్తి వివరాలని మీరు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version