వీఐ సరికొత్త ప్లాన్స్‌ … డిస్నీ+ హాట్‌స్టార్‌ ఉచితం

-

వొడాఫోన్‌ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.401, రూ.501,రూ.601,రూ.801 తో ప్లాన్లతో రీఛార్జీ చేసుకునేవారికి డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్లపై ప్రతిరోజూ 3 జీబీ డేటా కూడా లభించనుంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ బెనిఫిట్స్‌ కూడా అందిచనుంది. ఇది పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లకి కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌ ను ఉచితంగా అందిస్తోంది. ప్రీపెయిడ్‌ ప్లాన్‌కు హైస్పీడ్‌ నైట్‌టైమ్‌ ఇంటర్నెట్‌ వెసులుబాటు ఉంటుంది. వీకెండ్‌ డేటా రోల్‌ ఓవర్, రూ.499 కంటే ఎక్కువ ప్లాన్లు తీసుకునేవారికి ఎక్కువ ఆఫర్లను ప్రకటించింది. వీఐ రూ.401 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జీ చేసుకున్నవారికి 28 రోజుల వ్యాలిడీటి ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా చొప్పున 84 జీబీ వరకు డేటాను వాడుకోవచ్చు. అదనంగా మరో 16 జీబీ డేటా కూడా లభిస్తుంది. మొత్తం 100 జీబీ డేటా వాడుకోవచ్చు.

వొడాఫోన్‌ ఐడియా రూ.501 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసేవారికి 56 రోజుల వర్తిస్తుంది. మొ త్తం 75జీబీ డేటా లభిస్తుంది. ఏడాది డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. మూవీస్, టీవీ యాక్సెస్‌ లభిస్తాయి.
రూ.601 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసేవారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 184జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు ఏడాది డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.

రూ.801 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసేవారికి 84 రోజుల లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 252జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. 268జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు ఏడాది డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.

Read more RELATED
Recommended to you

Exit mobile version