బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్‌ను లింక్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ప్రతీ ఒక్కరు కూడా తమ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డు ని లింక్ చేసుకోవాలి. ఆర్థిక శాఖ ప్రకారం చూస్తే కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును తప్పక లింక్ చెయ్యాలి. అయితే చాలా మందికి ఎలా లింక్ చేసుకోవాలి అనేది తెలియదు.

 

కానీ ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే ఈజీగా మీరు మీ ఫోన్ సహాయంతో ఆధార్ ని లింక్ చేసేయచ్చు. అయితే మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్‌లైన్‌లోనే లింక్ చేసుకోవడం అవుతుంది. బ్యాంక్ బ్రాంచ్‌ లేదా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి కూడా చెయ్యచ్చు. కానీ మీరే చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ బెస్ట్.

మీరు కనుక లింక్ చెయ్యాలి అంటే నెట్ బ్యాంకింగ్ ఉండాలి.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తో లాగిన్ అయ్యి సర్వీసెస్‌లోకి వెళ్లాలి.
నెక్స్ట్ అప్‌డేట్ ఆధార్ కార్డు విత్ బ్యాంక్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ని ఎంటర్ చెయ్యాలి.
తర్వాత ఆధార్ నెంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేసేసి.. సబ్మిట్ చెయ్యండి.
ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది.
నెట్ బ్యాంకింగ్ కనుక లేనట్టయితే బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఫామ్ ఫిల్ చేసి లింక్ చేయించుకోవాలి.
లేదా ఎస్ఎంఎస్ ఆప్షన్ ద్వారా కూడా మీరు లింక్ చేసుకోచ్చు. యూఐడీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version