బ్లూమూన్ అంటే ఏమిటీ..? చంద్రుడు నిజంగా నీలం రంగులోకి మారతాడా..?

-

మన విశ్వంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. మనిషి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. విశ్వం గురించిన సమాచారం ఏదైనా ఆసక్తిగా ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని విశ్వాన్ని శోధించాలని, అదంతా మానవాళికి వెల్లడి చేయాలని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఐతే విశ్వం అనగానే ఆకాశం వైపే చూస్తుంటారు.

అప్పుడు మనకు కనిపించేవి సూర్యుడు, చంద్రుడు, ఇంకా నక్షత్రాలు. ఐతే తాజాగా చంద్రుడి గురించి ఒక విషయం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ 31వ తేదీన చంద్రుడు నీలం రంగులోకి మారిపోతాడని అంటున్నారు. నిజంగా చంద్రుడు నీలం రంగులోకి మారిపోతాడా అనే చర్చ మొదలైంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా చర్చలు నడుస్తున్నాయి.

ఐతే ఈ విషయమై ప్లానెటరీ సొసైటీ చెప్పిన ప్రకారం చంద్రుడు నీలం రంగులోకి మారడం అనేది నిజం కాదని తెలుస్తుంది. సూర్యుని నుండి కాంతిని స్వీకరించి మనకి చల్లని వెన్నలగా ప్రసాదించే చంద్రుడు నీలం రంగులోకి మారి మరింత వెన్నెల కురిపిస్తాడా అనే విషయమై ప్లానెటరీ సొసైటీ స్పష్టత ఇచ్చింది.

ఒక నెలలో రెండు పౌర్ణమిలు వస్తే దాన్ని బ్లూ మూన్ గా పిలుస్తారు. ఈ నెలలో అక్టోబర్ 2వ తేదీన మొదటొ పౌర్ణమి ఏర్పడగా, రెండవ పౌర్ణమి ఈరోజు (అక్టోబర్ 31వ తేదీ) ఏర్పడుతుంది. అందుకే బ్లూమూన్ గా పిలుస్తారు. సో.. ఇదండీ బ్లూ మూన్ సంగతి.

Read more RELATED
Recommended to you

Latest news