వాటే ఆఫర్… నెలకు రూ.3,800 తో యమహా ఎఫ్‌జెడ్ బైక్… !

Join Our Community
follow manalokam on social media

మీరు యమహా బైక్ కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీకోసం. ఈ ఆఫర్ ని వినియోగించుకుంటే ఈజీగా మీరు బైక్ ని పొందవచ్చు. లోన్ తీసుకొని ఈఎంఐ రూపం లో టూవీలర్ ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మీరు కొనుగోలు చెయ్యాలంటే బ్యాంక్ నుంచి టూవీలర్ లోన్ పొందొచ్చు లేదు అంటే నేరుగా షోరూమ్‌ నుండే ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తారు.

yamaha
yamaha

అలా అయినా మీరు తీసుకొచ్చు. యమహా ఎఫ్‌జెడ్ 25 బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే… ఈ బైక్ ధర రూ.1.73 లక్షలుగా ఉంది. మీరు డౌన్ పేమెంట్ కింద రూ.17 వేలు చెల్లిస్తే…. ఇప్పుడు మీరు రూ.1.56 లక్షలకు లోన్ తీసుకోవాలి. మీకు 9.7 శాతం వడ్డీ రేటు లో లోన్ వస్తే…. మీరు 36 నెలలు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే నెలకు రూ.5,600 కట్టాల్సి వస్తుంది.

ఇలా ఈఎంఐ కట్టడం కష్టం అని మీరు అనుకుంటే అప్పుడు మీరు 60 నెలల ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే…నెలకు రూ.3,882 చెల్లించాల్సి వస్తుంది. ఈఎంఐ తగ్గొచ్చు. కానీ కట్టడం సులభం అయినా వడ్డీ భారం మాత్రం పెరుగుతుంది. కాబట్టి తక్కువ టెన్యూర్ ఎంచుకోవడం బెస్ట్. ఈ బైక్ లో 250 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 43 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిలో ఐదు స్పీడ్ గేర్ బాక్స్, సెల్ఫ స్టార్ట్ ఫీచర్లు ఉంటాయి.

 

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...