ఘంటసాల బయోపిక్ టీజర్.. క్వాలిటీ మిస్సింగ్

-

తెలుగు సినిమా పరిశ్రమలో గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు పేరు సువర్ణాక్షరాలతో రాసి ఉంటుంది. ఆయన పాడిన పాటలు ఇప్పటికి ప్రేక్షక హృదయాలను కదిలిస్తాయి. తెలుగు పాటకు.. తెలుగు మాటకు.. తియ్యని బాణీలను.. తియ్యటి వాణీలను అందించిన ఘంటసాల వెంకటేశ్వర రావు ఎప్పుడు చిరస్మరనీయులే. అందుకే ఘంటసాల జీవిత చరిత్ర మీద సినిమా చేస్తున్నారు.

ఘంటసాల టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సింగర్ కృష్ణ చైతన్య లీడ్ రోల్ చేస్తున్నారు. సిహెచ్ రామారావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను లక్ష్మీ నీరజ నిర్మిస్తుండగా సాలూరు వాసూరావు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఎస్బి బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేయడం విశేషం.

అయితే ఈ టీజర్ చూస్తే కాస్త క్వాలిటీ మిస్సైన భావన రావడం సహజం. ఘంటసాల బాల్యంతో పాటుగా గాయకుడిగా మారక ముందు ఆయన పడిన కష్టాలను తెర మీద చూపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news