అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు – హరీష్ రావు

-

రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ( ఎస్ఎస్ఎ) లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ఏ లో పనిచేస్తున్న పది విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా తమకు రావాల్సిన సౌకర్యాల కోసం సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఇక సమ్మె బాట పట్టారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తుంది.

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హనుమకొండలో దీక్ష చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని విమర్శించారు. తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news