ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా లేదా ఇలా తెలుసుకోండి లేదంటే మీకే నష్టం… ?

-

ఒకవైపు కరోనా అందిన వారిని అందినట్లుగా కాటువేస్తుంటే, మరోవైపు సైబర్‌ క్రైమ్స్ కూడా ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కనీస అవసరాలు తీర్చుకోలేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో కొంత మందికి వచ్చే కాల్స్‌ వారి బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి.. ఇది ఒకటే కాదు ఇలా అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు నేరస్దులు.. ఇక సైబర్‌ కేసులు మొత్తం 2019 సంవత్సరలో 477 నమోదైతే కేవలం 2020లో గడిచిన ఐదు నెలలో 485 కేసులు నమోదయ్యాయట. ఈ సంఖ్య చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో లాక్‌డౌన్‌లో కాలంలోనే ఎక్కువగా కేసులు పెరిగాయి. ముఖ్యంగా హ్యకర్లు మనం వాడే ప్రతి టెక్నాలజీని హ్యక్ చేసి మోసాలు చేయడంలో ఆరితేరారు.. అందులో మన సెల్ ఫోన్లు ఒకటి..

ప్రస్తుత కాలంలో అందరు ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలనే నిర్వహిస్తున్న నేపధ్యంలో ఈ మోసాల తాలూకు తీవ్రత మరింత పెరిగింది.. ఒక్కోసారి బ్యాంకు నుండి ఓటీపీ రాకుండానే ఖాతాలోని నగదు ఖాళీ అవుతుందంటే అర్ధం చేసుకోండి.. ఇకపోతే అసలు మన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా.. కాలేదా.. ఒకవేళ హ్యాక్ అయితే ఎలా మళ్లీ మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి వంటి సెక్యూరిటీ అంశాలు చూస్తే.. ముందుగా #*#4636#*#* డయల్‌ చేయాలి.. ఇలా చేస్తే మన ఫోన్‌లోని పూర్తి టెక్నికల్‌ వివరాలు అంటే సిగ్నల్‌ స్ట్రెంత్, మొబైల్‌ సెక్యూరిటీ, కాల్‌ ఫార్వడింగ్‌ వివరాలు, బ్యాండ్‌ విడ్త్, లోకల్‌ ఏరియా వివరాలు ఇలా మీ ఫోన్లో ఉన్న చిన్నచిన్న వివరాలు అన్ని చూపిస్తుంది.

 

ఈ కోడ్‌ ద్వారా మన ఫోన్‌ సిమ్‌ సెట్టింగ్స్‌ కూడా మార్చుకోవచ్చు. ఇక పై కోడ్స్‌లో ఏవి డయల్‌ చేసినా ‘ఎనబల్‌’ అని కనిపిస్తే ఫార్వర్డింగ్‌లో ఉన్నట్లు లెక్క.. అయితే కాల్‌ ఫార్వర్డింగ్‌ వేన్‌ నాట్‌ రీచబల్‌ అని వస్తే సదరు నెంబరును సరి చూసుకుని అది మీకు సంబంధించినది అయితే అలాగే కంటిన్యూ అవ్వవచ్చు. మీ ఫోన్‌ కాల్‌ ఫార్వర్డ్‌ అవుతుందా. కాల్‌ డైవర్షన్‌ వంటివి జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే #21# అనే ఈ కోడ్ ఎంటర్‌ చేసే చాలు.. డయల్‌ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్‌పై ఫ్లాష్‌ మెసేజ్‌ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్‌ బాక్స్‌లో మన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఫార్వడింగ్‌ అని వస్తే మీ మొబైల్‌ హ్యాక్‌ అయిపోయినట్లే. ఇక #62# కోడ్‌ను రిపిటెడ్‌గా మూడుసార్లు చేస్తే మీ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లు ఏమైనా ఫార్వడింగ్‌ ఆగిపోతాయి. ఈ #002# అనే కోడ్‌ను కూడా డయల్‌ చేస్తే ఎప్పటికీ మన ఫోన్‌ నుంచి కాల్స్‌ ఫార్వర్డ్‌ అవ్వవు. ఒకవేళ ఇప్పటి వరకు ఏమైనా కాల్‌ ఫార్వడింగ్‌ ఉంటే అన్ని ఎరైస్‌ అయిపోతాయి..

Read more RELATED
Recommended to you

Latest news