స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన మీకుందా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోయే ఛాన్స్

-

డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్లకు ముందుగా కనిపించేది స్టాక్ మార్కెట్. దీంట్లో పెడితే డబ్బులు అమాంతం పెరిగిపోతాయని ఆశ పడుతుంటారు. అయితే పక్కన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారనో, సోషల్ మీడియాలో ఎక్కువగా యాడ్స్ కనిపిస్తున్నాయనో, మరోరకంగానూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం వల్ల నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి:

మార్కెట్ అంటే తెలియకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు డబ్బులు పెట్టడం సరికాదు.
ఏమీ తెలియకపోవడం వల్ల పక్కన వాళ్ళను చూసి ఫాలో అవ్వాల్సి వస్తుంది. దానివల్ల బోల్తా కొట్టే అవకాశం ఎక్కువ. కాబట్టి ముందుగా మార్కెట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది.

ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఏంటి:

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు సరే, ఎందుకోసం పెట్టాలనుకుంటున్నారు..? దానికంటూ పర్పస్ కచ్చితంగా ఉండాలి. మీకు లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసం ఎన్ని డబ్బులు కేటాయించాలనే ఆలోచన వస్తుంది. పర్పస్ లేకపోతే డబ్బులు పెడుతూనే ఉంటారు.

ఇంట్రాడే కి దూరం:

కొత్తగా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఏమీ తెలియకుండా ఇంట్రాడే చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట్లో దానికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

చిన్న మొత్తాలు:

ఫస్ట్ టైం పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయకండి. తక్కువ మొత్తాలతో స్టార్ట్ చేస్తే.. ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఐడియా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడైనా చిన్న మొత్తాలతో మొదలుపెట్టడమే మంచిది.

గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కుకు లోబడి ఉంటాయి. దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు స్టాక్స్ కి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news