నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అంతా ఒకరమైన హుషారులో ఉంటే… ఆయన అభిమానుల్లో కొందరు మాత్రం పూర్తి నిరాశలో ఉన్నారంట. దానికి కారణం మరేమిటో కాదు… నందమూరి మోక్షజ్ఞ! అవును… బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగోనంటూ వార్తలొస్తున్నాయి కానీ ఆ విషయం అలా నానుతూనే ఉంది. పూర్తి డైరెక్షన్ చేస్తాడని ఒకసారి, బోయపాటికే ఆ బాధ్యతలు అని మరోసారి ఇలా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం మోక్షజ్ఞను చూసినవారు మాత్రం… ఇకపై అలాంటి గాసిప్స్ ని నమ్మే పరిస్థితి లేదు!
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరోసారి మోక్షజ్ఞ హాట్ టాపిక్ అయ్యాడు. ఆయన ఫిజిక్ పై దారుణమైన కామెంట్లు పడుతున్నాయి. దానికి నందమూరి అభిమానుల దగ్గర రీకౌంటర్లు కూడా లేని పరిస్థితి! ఒకానొక సమయంలో… మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, బాడీ బిల్డింగ్ చేస్తున్నాడని, తొలి సినిమాలోనే సిక్స్ ప్యాక్స్ చూపించబోతున్నాడని తెగ రూమర్లు వచ్చాయి. అయితే… తాజా దర్శనంతో అన్ని రూమర్లకూ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదే క్రమంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండదని బాలయ్య కూడా ప్రకటించేశరికి… అభిమానులకు నిరాశే మిగిలింది. బాలయ్య ఈ స్పెష్హల్ బర్త్ డే రోజు ఎంతో ఉత్సాహంగా ఉన్న అభిమానులకు ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూసే!
బాలయ్య బర్త్ డే చెప్పిన బ్యాడ్ న్యూస్ ఇదే!
-