మిజోరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే ఇక ఇదే నేపద్యంలో అక్కడ మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా గురువారం తెల్లవారుజామున 1.14 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. మిజోరం లోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో తెల్లవారుజామున 1.14 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం లోతు 21 కిలోమీటర్లు కాగా రిక్టర్ స్కేల్ లో 4.5 తీవ్రత నమోదయింది. ఆ ప్రాంతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి మంగళవారం ల్లవారుజామున కూడా చంఫాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అంతకుముందు ఈ నెల 22 న కేవలం 12 గంటల వ్యవదిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. ఇక 21 న ఈశాన్య రాష్ట్రం లోని ఇజ్వాల్ లో భూకంపం సంభవించింది దాని తీవ్రత 5.1 గా నమోదయ్యింది.కేవలం ఒక వారం వ్యావడిలో ఆరు సార్లు భూకంపం నమోడవ్వడం గమనార్హం. వరుస భూకంపాలతో ఆ ప్రాంతం తల్లడిల్లుతుంది ప్రజలు ఎవ్వరూ ప్రశాంతంగా కునుకు తీయడం లేదని అక్కడి ముఖ్యమంత్రి జోరాంతంగా వాపోతున్నారు.
మిజోరంలో మరో భూకంపం.. లోతు 21 కిలోమీటర్లు..!
-