కరోనా దెబ్బకి ప్రజలు లబోదిబోమంటున్నారు, ఇక ఆర్టీసీ రాంగానిది కూడా ఇదే పరిస్తితి..! ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. గతంలో వారం రోజులకు ఆర్టీసీ కి 12 కోట్ల ఆదాయాలు వచ్చేవి ఇప్పుడు ఆర్టీసీ కి కేవలం 2.43 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. త్వరలో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులూ నడుస్తాయని అనేక వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తుంటే అలా జరగకదనే అనిపిస్తుంది. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తరువాతి చర్చల గురించి బుధవారం ఇరు ఆర్టీసీల మధ్య చర్చ జరగాల్సి ఉంది. ఇంతలో టీఎస్‌ఆర్టీసీ హెడ్ ఆఫీస్ లోని ఓ టెక్నికల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో నిన్న జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు ప్రయాణం పై సందిగ్దత్త ఏర్పడింది.
బస్సు కు బ్రేక్ వేస్తున్న కరోనా..! ఏపీ తెలంగాణ బస్సు సర్వీసులు బంధ్..!
-