కన్నెర్రజేసిన బ్రహ్మపుత్ర…! 25 మంది మృతి.., 25,461 మంది అవస్థలు..!

-

huge flood at assam leads to heavy loss
huge flood at assam leads to heavy loss

బ్రహ్మపుత్ర కన్నెర్రజేసింది..! ఉదృతంగా ప్రవహిస్తుంది వరద తాకిడికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు 25,461 మంది ఇల్లు వాకిలి లేకా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిభిరాలలో తలదాచుకుంటున్నారు. అసోం ప్రజలకు ఇప్పుడు రాహు కాలం నడుస్తుంది. ఓ పక్క కరోనా కలకలం మరో పక్క బ్రహ్మపుత్ర వరద బీభత్సం. భారీ వర్షాల కారణంగా అసోంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. అసోం లో మొత్తం 33 జిల్లాలు ఉండగా 25 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది కొందరు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు రైతులు పంటలు నష్టపోయారు అధికారులకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. వరద తాకిడికి దాదాపుగా 83,168 హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బర్‌పేట ప్రాంతానికి వరద ఉద్ధృతి వల్ల ప్రముఖ కజిరంగా, ఓరంగ్‌ జాతీయ ఉద్యానవనాలతో సహా పోబిటోరా వన్యప్రాణ సంరక్షణ కేంద్రం నీట మునిగింది. రాష్ట్రవ్యాప్తంగా 265 నిర్వాసిత శిబిరాలు ఏర్పాటు చేయగా… 25,461 మంది ఆశ్రయం పొందుతున్నారు. గువహటి, జోర్‌హట్‌, తేజ్‌పూర్‌, గోల్‌పారా, దుబ్రీ దగ్గర బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ప్రవాహాల ధాటికి పలుచోట్ల రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దీన స్థితిలో కేంద్రం తమకు అండగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అసోం ముఖ్యమంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news