చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం లడఖ్‌లో పర్యటిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆయన లేహ్‌లో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అక్కడి 14 కార్ప్స్ సహా ఆర్మీ ఉన్నతాధికారులందరితోనూ మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే మోదీ సడెన్‌గా లేహ్‌లో పర్యటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడడంతో వారికి కొండంత ధైర్యం వచ్చి వారిలో ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరిగింది. కానీ మోదీ అలా సరిహద్దుల్లో పర్యటించడంతో డ్రాగన్ దేశం చైనాకు ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది.
దేశం కోసం అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధమేనని మోదీ అన్నారు. శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తున్నామని, గతంలో ఎన్నో సార్లు శత్రువులపై విజయం సాధించామని, ఇకపై కూడా విజయం మనదేనని ఆయన అన్నారు. అలాగే ప్రపంచ శాంతికి చైనా ప్రమాదకరంగా పరిణమించిందని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో శత్రు దేశాలు ఏవో ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. ఆయన పాక్, చైనాలతోపాటు మొన్నీ మధ్య నుంచి తోకాడిస్తున్న నేపాల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు. అయితే మోదీ పర్యటనతో ఆయా శత్రుదేశాలకు మాత్రం ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుందని తెలుస్తోంది.
సాధారణంగా ఏ దేశ ప్రధాని అయినా.. అధ్యక్షుడైనా సరే.. సరిహద్దుల్లో.. అందులోనూ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో పర్యటించేందుకు సాహసం చేయరు. కానీ మోదీ అలా కాదు. ఆయన శత్రుదేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కోసమే ఇలా పర్యటించారని స్పష్టమవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆయా దేశాలు భారత్‌ను ఎంతో తక్కువగా అంచనా వేస్తూ వస్తున్నాయి. కానీ మీ ఆటలకు ఇక కాలం చెల్లింది, మీరేం చేసినా మేం చూస్తూ ఊరుకోం, దీటైన సమాధానం చెబుతాం, జాగ్రత్తగా ఉండండి.. అని మోదీ ఆయా దేశాలకు చెప్పకనే చెప్పారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే మోదీ పర్యటనపై ఆయా దేశాలు ఇంకా స్పందించాల్సి ఉంది. కానీ మోదీ మాత్రం ఇకపై సరిహద్దు వివాదాల్లో చాలా కఠినంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారట. అందుకనే లేహ్‌లో సడెన్‌గా పర్యటించారట. మరి ముందు ముందు మోదీ ఆయా దేశాలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో చూడాలి.