తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేక్ వేసిందనే చెప్పాలి. సోమవారం వరకు పనులు నిలిపేయాలని నూతన ఆదేశాలను జారీ చేసింది కేంద్రం. ఇదిలా ఉండగా నగరానికి చెందిన సామాజిక వేత్త పి ఎల్ విశ్వేశ్వరరావు వేసిన ఎపిల్ పై న్యాయస్థానం విచారణ చేసి తాజా ఆదేశాలు ఇచ్చింది.
అయితే తర్వాత ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేయకూడదని తెలిపింది. కానీ దీనిని ఇప్పటికే 60 శాతం వరకు కూల్చి వేసారట సచివాలయ అధికారులు. వాళ్లకి ఏ ఆదేశాలు అందలేదని యధావిధిగా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఒకవేళ కనుక ఆదేశాలు కనుక వాళ్లకి చేరితే వాళ్ళు తప్పకుండా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
వారం రోజుల క్రితం సెక్రటేరియట్ కూల్చివేత పనులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మంగళవారం కూల్చివేత పనులు ప్రారంభించారు నాలుగు రోజులు పని నిర్విరామంగా జరిగింది హైకోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు బ్రేక్ పడింది