కేసీఆర్ సర్కార్ కి షాక్.. సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేక్..!

-

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని దాఖలైన పిల్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు కూల్చివేతను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే నూతన సచివాలయ నమూనాను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణ పనులను శ్రావణ మాసంలో ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. దీనిపై విపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా.. ప్రజా ధనాన్ని వృథా చేయడం అవసరమా అని మండిపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో కూల్చివేత పనులు నిలిచిపోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news