కర్ణాటక సీఎం ఆఫీస్ లో మరో సారి కరోనా….!

-

కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి మరోసారి కరోనా దెబ్బ తగిలింది. అయితే ఇది నిజంగా ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడుయూరప్ప స్వీయ నియంత్రణ లోకి వెళ్లారు అయితే సీఎం ఆఫీస్ కృష్ణ లో పనిచేసే సిబ్బందికి వైరస్ పాజిటివ్ రావడంతో వాళ్ళ కార్యక్రమాలన్నీ రద్దు చేసి కొద్ది రోజుల వరకు ఇంట్లోంచి పని చేయాలని అన్నారు. అయితే తన అధికారిక నివాసం లో పనిచేసే డ్రైవర్ తో పాటు ఇతర ఉద్యోగులకి కూడా పాజిటివ్ వచ్చిందట.

karnataka-corona
karnataka-corona

దీనితో తాను ఇంటి నుంచి వీడియో కాల్స్ ద్వారా కొన్ని రోజులు పని చేస్తానని చెప్పారు సీఎం. ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని, తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. కరోనా సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, తప్పని సరిగా మాస్కు ధరించి పని చేయాలని చెప్పారు.

అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి అయ్యి ప్రజలందరికీ పీడిస్తోంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ వైరస్ తో గజగజలాడుతున్నారు. దీనిని కట్టి పెట్టాలంటే మనం తప్పకుండా శారీరక దూరం పాటించాలి. అంతే కాకుండా మాస్కులు కూడా ధరించాలి ఈ విషయంపై యడుయూరప్ప సూచిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు

ఇదిలా ఉంటే సీఎం ఆఫీసులో జూన్ 19న ఒక ఉద్యోగి కి కరోనా వచ్చింది. జూన్ 25న సిబ్బందుల్లో నలుగురు కరోనా బారిన పడ్డారు. అయితే ఈ సందర్భంగా ఆఫీస్ శానిటేషన్ చేసే కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం కర్ణాటక రాష్ట్రంలో 2228 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 31105 కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news