తెలంగాణలో పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్ల పై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. “కల్లబొల్లి మాటలు జెప్పి పెద్దమనుషులను కూడా మోసం చేసింది కాంగ్రెస్. ఆసరా పెన్షన్లతో అవ్వ- తాతలకు భరోసా నింపింది కేసీఆర్ గారి సర్కార్. రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి కోడుకులు,కోడళ్ళు ప్రేమగా చూసుకునేలా చేసింది బిఆర్ఎస్. బొడ్లే సంచి బరువు పెంచి అమ్మమ్మ-నాయనమ్మల గౌరవం పెంచారు కేసీఆర్.
కానీ 4 వేలు ఇస్తా అని జూటా మాటలు చెప్పి మేమిచ్చిన పింఛన్ కూడా సరిగా ఇవ్వని రేవంత్ సర్కార్ ఇయ్యాల పండు ముసలవ్వలను సైతం రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. మొన్న గద్వాల్ లో అవ్వా-తాతలు రోడ్ల మీద ధర్నా-ఇవ్వాళా మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో వృద్ధ దంపతులు.. సిగ్గు అనిపించడం లేదా..? రేవంత్ నీకు అవ్వలు రోడ్డెక్కితే తక్షణం మీ జూటా హామీని అమలు చేసి అవ్వలకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.