ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ఏ రేంజిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రస్తుతానికి ఏడు లక్షల 90 వేలు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా మరోవైపు దేశంలో నేటి వరకు 495000 మంది రికవర్ అయ్యారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ దేశంలో కరోనా రోగుల రికవరీ 63 శాతం ఉన్నట్లు ఆయన తెలియజేశారు.
అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణాల రేటు 2.72% గా ఉన్నట్లు తెలియజేశారు. అలాగే దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య పట్ల ఎలాంటి ఆందోళన లేదని ఎక్కువ స్థాయిలో కేసులను కనుగొనేందుకు టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ప్రతిరోజు దేశంలో 2 లక్షల 70 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే కొన్ని చోట్ల కేవలం స్వల్ప స్థాయిలో మాత్రమే కరోనా వైరస్ విజృంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.