బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ అరెస్ట్ …!

-

తాజాగా పంజాబ్ పోలీసులు జమ్ము లోని అంతర్జాతీయ భారత్ – పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఓ జవాను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలియడంతో అతనిని అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు సంబంధించిన జవాన్ నుండి మారణ ఆయుధాలు, కొన్ని మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సదరు జవాన్ జమ్మూ సాంబ సెక్టార్ లో మోహరించిన బిఎస్ఎఫ్ బృందంతో అందుబాటులో లేడని తెలుస్తోంది.

jawan
jawan

ఈ నేపధ్యంలో అతడిని దగ్గర ఉన్న ఒక పిస్టల్ 9mm క్యాలిబర్, అందుకు సంబంధించిన బుల్లెట్లు, 12 రైఫిల్ లోని రెండు రౌండ్లు, అలాగే మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఓ వైపు చైనాతో ఉద్రిక్తత పరిస్థితులు జరుగుతుండగా, ఈ నేపథ్యంలో ఓ వైపు పాకిస్తాన్ సరిహద్దులో ఇలాంటి చర్యలు చెలరేగడంతో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నిజంగా ఓ భారత జవాన్ ఇలా చేశాడంటే నమ్మశక్యంగా లేదు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news