గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ నిర్ణయించే అవకాశాన్ని కేంద్రం ఇవ్వడంతో చమురు కంపెనీలు ఏరోజుకారోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి.
అయితే చమురు కంపెనీలు… గత 23 రోజులుగా పెట్రోల్ ధరను మార్చకుండా అలాగే ఉంచుతున్నాయి. గత ఐదు వారాల్లో డీజిల్ ధరను 28 సార్లు పెంచాయి. పెట్రోల్ ధరను 21 సార్లు పెంచాయి. జూన్ 7 నుంచి చమురు కంపెనీలు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. జూన్ 29 నుంచి పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.
అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు మిశ్రమంగా ఉండటంతో దేశీ ఇంధన ధరల్లో మార్పు కనబడలేదు. హైదరాబాద్ లో బుధవారం పెట్రోల్ ధర లీటర్ కు రూ.83.49 ఉండగా డీజిల్ ధర లీటర్ కు రూ.79.85 ఉంది.
ఏపీ రాజధాని అమరావతిలో కూడా పెట్రో ధరలు పరిస్థితి అలాగే కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.83.96 ఉండగా.. డీజిల్ ధర లీటర్ కు రూ.80.01 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.43 గా ఉండగా డీజిల్ ధర రూ.79.73 వద్ద స్థిరంగా ఉంది. తాజా ధర ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.81.64కి పెరిగింది. అలాగే ముంబైలో అది రూ.79.83గా మారింది. చెన్నైలో రూ.78.60 ఉండగా.. కోల్‌కతాలో రూ.76.77కి పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో రూ.79.85 ఉండగా, బెంగళూరులో రూ.77.59గా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు బుధవారం మరింత తగ్గాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటమే అందుకు కారణం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 32 సెంట్లు తగ్గింది. బ్యారెల్ ప్రస్తుతం 44 డాలర్లు ఉంది. ప్రస్తుతం అది 41.59 డాలర్లకు లభిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు. 859 బిలియన్ డాలర్లను కరోనా వచ్చిన దేశాలకు, కరోనా వ్యాక్సిన్ల తయారీకి ఫండ్‌గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి.