తల్లితో సహజీవనం చేస్తూ కూతురిపై లైంగిక దాడి చేసిన ఓ దుర్మార్గుడు..!

-

నేటి సమాజంలో మగవాళ్ళు మృగాళ్ల కంటే అతి కిరాతకంగా మారుతున్నారు. వావి వరసలు మరచి ఆడవారి పై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒంగోలు జిల్లాలో ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే… ఒంగోలు జిల్లాలోని గోపాల్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి… అర్ధవీడు కి చెందిన సుభాని అనే ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె స్థానిక కళాశాలలో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది.

crime
crime

అయితే ఆ మహిళకు ఒక కుమార్తె కూడా ఉండడంతో ఆమె పై కన్నేశాడు ఈ దుర్మార్గుడు. ఒకరోజు ఆ మహిళ బయటకు వెళ్లడంతో అదే అదనుగా భావించిన సుభాని ఆమె కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఈ విషయం తన తల్లికి చెప్పి బోరున ఏడ్చేసింది. కానీ ఆ తల్లి మాత్రం తన కూతురికి జరిగిన అఘాయిత్యం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన సదరు బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి తల దాచుకుంది. తదనంతరం దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించి తనకు రక్షణ కల్పించాలని సుభానికి శిక్ష విధించాలని ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news