ఆధార్ కార్డుంటే.. ఇంట్లో నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ !

-

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల సంపూర్ణ లాక్ డౌన్ తర్వాత కొన్ని సడలింపులతో లాక్ డౌన్ కు స్వస్థి పలికాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు కంపెనీలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే బాటలో బ్యాంకులు నడుస్తున్నాయి.

aadhar-card
aadhar-card

ఇప్పుడు మీరు బ్యాంక్ లో అకౌంట్ తెరవాలని అనుకుంటున్నారా ? అయితే మీకో శుభవార్త. కరోనా విజృంభిస్తున్న తరుణంలో బ్యాంకులు ఇప్పుడు ఆన్ లైన్లో బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఆన్ లైన్ ఓపెనింగ్ సర్వీసులు పారంభించాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీటి సరసన నిలిచింది.

బ్యాంక్ బరోడా. ఇది దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్. ఇన్ స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ పేరుతో కస్టమర్లకు ఈ సర్వీసులను అందించనుంది. ఆధార్ సర్వీసులు, ఓటీపీ సేవలు, డిజిటల్ కేవైసీని ఆన్ లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవచ్చు. బ్యాంక్ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. లేదా మొబైల్ యాప్ ద్వారా అకౌంట్ తెరిచి లావాదేవీలు జరుపుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. కరోనా నేపథ్యంలో 2023 వరకూ ఈ సేవలు కొనసాగుతాయని బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజీవ్ చద్దా వెల్లడించాడు.

ఈ సర్వీసులతో మీరు ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని పేర్కొన్నాడు. ఆన్ లైన్లో బ్యాంక్ అకౌంట్ తెరిచిన వారు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డు వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మోనో ప్లాట్ ఫామ్ ద్వారా కస్టమర్లు బ్యాంక్ ఖాతాను తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, భారత దేశ అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కూడా ఆధార్ కార్డుతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ను మరోమారు అందుబాటులోకి తీసుకోచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news