గత కొన్ని రోజుల నుంచి న్యాయస్థానాలు జగన్ సర్కార్ కు షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో జగన్ సర్కార్ కోర్టులను ఆశ్రయించడం… జగన్ సర్కార్ కు కోర్టుల తీర్పు తో నిరాశ ఎదురవడం జరుగుతుంది. ఇలా మొదటి నుంచి జగన్ సర్కార్కు న్యాయస్థానాలు తీర్పులతో మొట్టికాయలు వేస్తున్నట్లు గానే ఉంది. అయితే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. అమర్ రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు నిచ్చింది.
తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమర రాజా ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇటీవల విచారణ జరపగా… ఆసక్తికర తీర్పును వెలువరించింది హైకోర్టు. అమర రాజు సంస్థకు 483 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. ఈ భూమిలో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అమర్ రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు,