వాహనదారులుకి కాస్త ఊరట లభించింది. మీరు కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే నిజంగా ఇది మీకు గుడ్ న్యూస్. ఈరోజు నుంచి తక్కువ ధరలకే వాహనాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే ఐ ఆర్ డి ఎ కొత్త రూల్స్ ని అమల్లోకి తీసుకు వచ్చింది. మీరు కొత్తగా బైక్ లేదా కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇది నిజంగా సరైన సమయం. వాహన ధరలు ఈరోజు నుంచి తగ్గనున్నాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే తక్కువ ధరకు మీకు వాహనం లభిస్తుంది.
అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆగస్టు 1 నుంచి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఉపసంహరించుకోనున్నాయి. ఐఆర్డీఏ ఇప్పటికే సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 5 ఏళ్లకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఈసారి లేదు. అయితే కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. దీంతో 11 నుంచి వాహనాలు కొనుగోలు చేస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు. తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది కనుక మొత్తంగా వెహికిల్ ఆన్ రోడ్ ధర కూడా కిందకి పడింది.
ప్రస్తుతం ఫోర్ వీలర్ కు మూడేళ్లు, టూవీలర్ కు ఐదేళ్లు లాంగ్ టైం కాన్ఫరెన్సు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల వాహనదారులు అన్ని సంవత్సరాల మొత్తాన్ని ముందుగానే చెల్లించాల్సి వస్తుంది. దీంతో వెహికిల్ ఆన్ రోడ్ ప్రైస్ భారీగా పెరుగుతోంది. దీర్ఘకాలిక పాలసీలు కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆగస్ట్ 1 నుంచి టూవీలర్ లేదా ఫోర్ వీలర్ కొనే వాహనదారులు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత రెన్యూవల్ చేయించవచ్చు.