బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం – సీఎం చంద్రబాబు

-

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. బీసీల కోసం ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్ల సాధన కోసం న్యాయమైన పోరాటం చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34% నుంచి 24% కి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని తెలిపారు.

వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారం పై సమీక్షలో చర్చించారు. ఇక బీసీ సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన, బాలికల హాస్టల్లకు తక్షణం మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. పెన్షన్లు తొలగించడం లేదని.. ఇందుకు సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు చంద్రబాబు.

రాష్ట్రంలో మొత్తం 1100కు పైగా బీసీ విద్యార్థుల హాస్టల్ లు ఉన్నాయని తెలిపారు. వీటిలో 660 ప్రభుత్వ భవనాలు, 450 అద్దె భవనాలు ఉన్నాయని.. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 110.52 కోట్ల డైట్ బిల్లులో కూటమి ప్రభుత్వం 76.38 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. మరో 34.14 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news