సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి – మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ హీరో అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ని నేడు మరోసారి పరామర్శించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ తేజ్ కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉందన్నారు.

సంధ్యా థియేటర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు. సినిమా పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి నాయకులు చేసిన దాడిని ఆయన ఖండించారు. ఇళ్ళ మీద దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అటు అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా..? అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. ఐకాన్ స్టార్ అయితే ఎవరిని చంపినా పరవాలేదా..? అన్నారు. ప్రధాన మంత్రి అయినా, సర్పంచ్ అయినా, ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టమని స్పష్టం చేశారు మంత్రి. జింకను చంపిన కేసులో ఇంటర్నేషనల్ స్టార్ సల్మాన్ ఖానే 14 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి తనని, సీఎం రేవంత్ రెడ్డిని అలా అనడం కరెక్ట్ కాదని.. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news