దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కేసులు ఆగకపోయినా సరే రికవరీ రేటు మాత్రం భారీగా పెరుగుతూనే ఉంది. మన దేశంలో రికవరీ రేటు అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది అనే మాట లెక్కలే చెప్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోన రికవరీ రేటుకి సంబంధించి లెక్కలు విడుదల చేసింది.
కరోనా కేసుల్లోనే కాదు రికవరీల్లోనూ రికార్డు సృష్టిస్తుంది భారత్. గత 24 గంటల్లో కరోన నుంచి పూర్తిగా కోలుకుని 49,769 మంది డిశ్చార్జ్ అయ్యారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 68% కి చేరింది. మరణాల రేటు 2.05%కి పరిమితం అయింది అని కేంద్రం పేర్కొంది. అమెరికాలో మరణాల రేటు చాలా అధికంగా ఉంది.