నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక పన్నెండేళ్ళ బాలుడు తన ఇంటి పక్క ఉండే ఒక బాలిక తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు బాలిక తల్లి తండ్రులు బాలుడి ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకున్నారు. దీనిని అవమానంగా భావించిన సదరు బాలుని పెదనాన్న బాలున్ని రోడ్డు మీదే చితక బాదాడు.
అందరూ చూస్తుండగా కాళ్లకు తాళ్ళు కట్టి బాలుని పెద్ద నాన్న బాలయ్య ఈడ్చుకెళ్ళిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పు జరిగింది కొట్టవద్దని బాలుడు ప్రాధేయ పడినా పెదనాన్న వినకుండా కొట్టి, కాళ్ళకి తాడు కట్టి కాస్త దూరం లాక్కు వెళ్ళాడు. అనంతరం చెట్టుకు కట్టేసి కూడా బాలుడిని చితక బాదాడు సదరు మూర్ఖపు పెదనాన్న. అయితే ఇంత జరుగుతున్నా కుటుంబ విషయాల్లోకి వెళ్ళడం ఎందుకు అనుకున్నారో ఏమో ఒక్కరు కూడా అతన్ని వారించక పోవడం గమనార్హం.