చికిత్సకు స్పందిస్తున్న ప్రణబ్ .. నిలకడగా ఆరోగ్యం

-

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడుతోందని… చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆయన కుమారుడు అభిజిత్​ ముఖర్జీ తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్​లో పేర్కొన్నారు.నేను ఆయన్ని కలిశాను. ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షించడం వల్ల.. రికవరీ అవుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్య సూచీలన్నీ బాగున్నాయి. తొందరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాను అని ప్రణబ్​ ముఖర్జీ కుమారుడు అభిజిత్​ ముఖర్జీ అన్నారు.

pranab-mukherjee
pranab-mukherjee

అయితే ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇందుకు భిన్నంగా బులెటిన్​ విడుదల చేశారు. ‘ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. కీలక ఆరోగ్య సూచీలన్నీ స్థిరంగా ఉన్నాయి. వెంటిలేటర్​ సాయంతో చికిత్స పొందుతున్నారు’ అని తెలిపారు.ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news