సేమ్ డెమొక్రసీ నినాదంతో ముందుకు
ప్రజాగాయకుడు గద్దర్ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదన్నారు గద్దర్. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాలను కలవం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు.
ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గాల పరిధిలో ఓటు పై చైతన్యం కల్పిస్తామన్నారు పేర్కొన్నారు. రెండో దశలో ఎస్సీ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానంటూ వివరించారు. మనుషుల కంటే సిద్ధాంతాలు ముఖ్యమన్నారు.. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు ఎందుకు.. రాజ్యాంగం ఎందుకని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ప్రజా స్వామ్యం చాలా ఇబ్బందుల్లో ఉందన్నారు. అందుకే సేవ్ డెమొక్రసీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకళ్తానని వివరించారు.