రియా చక్రవర్తి, మహేష్ భట్ చాటింగ్ వైరల్..!

-

బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి, దర్శకనిర్మాత మహేశ్​భట్​లకు సంబంధించిన వాట్సప్​ చాటింగ్​ అంటూ సోషల్​మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్​ అవుతున్నాయి. ఆమె ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ను రియా విడిచిపెట్టిన విషయాన్ని ఆ దర్శకుడికి తెలియజేసినట్లు సందేశాల ద్వారా తెలుస్తోంది.సుశాంత్​, రియాల ప్రేమవ్యవహారంతో హీరోయిన్​ తండ్రి సంతోషంగా లేరని మహేశ్​భట్​ చేసిన చాటింగ్​ ద్వారా తెలుస్తోంది. అదే విధంగా సుశాంత్​కు వ్యతిరేకంగా దర్శకుడు హెచ్చరించాడని సంభాషణ సూచిస్తోంది. రియా, మహేశ్​భట్​ల చాటింగ్​కు సంబంధించిన స్క్రీన్​షాట్లు అంటూ రెండు ఫొటోలు గురువారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

riya and mahesh chat
riya and mahesh chat

ఈ సంభాషణ మొత్తం చూస్తుంటే రియా చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్​ భట్​ను ఉద్దేశిస్తూ..’ఐ లవ్​యూ మై బెస్ట్​ మ్యాన్​. మీరు గర్వించే విధంగా చేస్తా’ అని రియా సందేశాన్ని పంపింది.నటి రియా చక్రవర్తి ప్రియుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ జూన్​ 14న తన నివాసంలో అనుమానస్పదంగా మృతి చెందాడు. హీరో మృతిపై పలు అనుమాలను రేకెత్తిస్తున్న క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుశాంత్​ తండ్రి కేకే సింగ్​ బిహార్​ ప్రభుత్వాన్ని అభ్యర్థించగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించింది. మరోవైపు కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని నటి రియా దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సుశాంత్​ మృతి వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

riya and mahesh
riya and mahesh

Read more RELATED
Recommended to you

Latest news