23.5 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజ‌ర్ల డేటా లీక్‌..!

-

ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో నెటిజ‌న్ల డేటాకు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. వారు ఉప‌యోగించే అనేక స‌ర్వీస్‌లలోని వారి డేటా ఎప్ప‌టిక‌ప్పుడు లీక‌వుతూనే ఉంది. గ‌తంలో ఫేస్‌బుక్ యూజ‌ర్ల డేటా ప‌లు మార్లు లీక‌వ్వ‌గా.. ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజ‌ర్ల డేటా లీకైంది. మొత్తం 23.5 కోట్ల మంది యూజ‌ర్ల డేటా లీకైన‌ట్లు వెల్ల‌డైంది.

23.5 crores of instagram youtube and tiktok users data leaked

ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజ‌ర్ల‌కు చెందిన కాంటాక్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, పేర్లు, ఇమేజ్‌లు, ఇత‌ర వివ‌రాలు లీక‌య్యాయి. అయితే ఈ డేటాను డీప్ సోష‌ల్ అనే కంపెనీ లీక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన సోష‌ల్ డేటా అనే కంపెనీకి డీప్ సోష‌ల్‌తో లింకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై సోష‌ల్ డేటా స్పందించింది. డేటా లీక్ అయిన మాట వాస్త‌వ‌మేన‌ని.. కానీ డేటాను సేక‌రించడాన్ని ప్ర‌స్తుతం ఆపేశామ‌ని ఆ కంపెనీ తెలిపింది.

అయితే నిజానికి ఇంట‌ర్నెట్‌లో ప‌బ్లిక్ అందరికీ అందుబాటులో ఉండే డేటాను సేక‌రించ‌డం త‌ప్పేమీ కాద‌ని, అది హ్యాకింగ్ కింద‌కు రాద‌ని సోష‌ల్ డేటా వ్యాఖ్యానించింది. కాగా ఇలా సేక‌రించిన డేటాను ఫిషింగ్ వంటి స్కాంల‌కు ఉప‌యోగిస్తారు. అందువ‌ల్ల ఈ విష‌యం నెటిజన్ల భ‌ద్ర‌త‌కు ముప్పును క‌లిగిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. కాగా గ‌తంలోనూ ఫేస్‌బుక్ ఇలాంటి ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంది. యూజ‌ర్ల డేటాను ఇత‌ర కంపెనీలు చోరీ చేస్తున్నా ఫేస్‌బుక్ ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. దీంతో అలాంటి కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఫేస్‌బుక్ త‌రువాత యూజ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. ఇక ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ ఇలా యూజ‌ర్ల డేటా లీక్ అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news