మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తో జోంబీ రెడ్డి మోషన్ పోస్టర్​ విడుదల

-

అ!’, ‘కల్కి’ లాంటి వినూత్న చిత్రాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ‘జోంబీ రెడ్డి’ పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ టీజర్​ను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా శనివారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఓ మోషన్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో కరోనా నేపథ్య కథాంశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్​ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

chiru
chiru

చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్​లుక్, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఈ సర్​ప్రైజ్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో ఎర్ర కండువాతో కనిపిస్తున్నాడు చిరు.

Read more RELATED
Recommended to you

Latest news