అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూకంపం

-

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అంజమ్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజూమున భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. తెల్ల‌వారుజామున 3 గంటల 36 నిమిషాలకు చాంగ్లాంగ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో 27.7 అకాంక్షాలు, 96.79 రేఖాంశాలకు 120 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

ఒక్కసారిగా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించ లేదు. ఆగస్టు 6 న కూడా రాష్ట్రంలోని తవాంగ్కు 42 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రత నమోదైన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news