దేశంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు

-

ఈదేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలని..  ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఇవాళ పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఎంపీ ఈటల రాజేందర్. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారు. తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు. దేశం అటువైపు వెళ్ళాలి.. ప్రజలు వారి కాళ్ళ మీద బ్రతికే దిశగా ఎదగాలన్నారు.

భారతదేశం యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ప్రోత్సాహకాలు అందిస్తుంది. నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమేనని..  స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడం. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు.  పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయి. నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలి. దీనికోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడ్డాను. వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు చేసేవారు.
చేతి వృత్తుల వారు జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళు. వారికి ఏం ఇచ్చినా తక్కువే అన్నారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news