ఇక నుంచి నేరాలు చేస్తే.. మక్కెలు ఇరగ్గొడుతానని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో పద్దతి లేని పరిపాలన కొనసాగించారని.. 2014-2019 వరకు ఉన్న సీఎం ను ఇప్పటివరకు తాను చూడలేదన్నారు.
గతంలో జగన్ ప్రభుత్వంలో పరదాలు కట్టేవారు. డ్వాక్రా సంఘాల మహిళలను లాక్కొచ్చేవారని పేర్కొన్నారు. మహిళలు రాకపోతే పింఛన్, రేషన్ కట్ అయ్యే పరిస్తితి ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాదు.. ప్రతినెల 01వ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వైసీపీని భూ స్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. వరదలతో దాదాపు 6 లక్షల మంది బాధ పడ్డారు. వరదల నుంచి బయటపడటానికి 10రోజులకు పైగా సమయం పట్టింది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీ కొట్టాయి. నేరాలు చేయడం వేరే వారిపై నెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. రాజకీయ ముసుగులో కొందరూ నేరాలు చేయాలనుకుంటున్నారు. అలా చేస్తే.. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.