వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మోకా భాస్కరావు హత్య కేసులో ఏ4గా ఉన్న కొల్లు రవీంద్రకు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈయన నిందితులకు సహకరించారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా ఆయన మిస్ అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో పోలీసులు అరెస్ట్ చేయగా కోర్ట్ ఆయనకు రిమాండ్ విధిందింది. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. గత 53 రోజులుగా జైల్లోనే ఉన్న కొల్లు ఈ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 28 రోజుల పాటూ విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.. అది కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కేసులు ఉన్నాయి.. అందుకే ఆయన్ను విజయవాడలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కోర్టు ఆదేశించింది.