మీడియా సంస్థపై నారా లోకేష్ ప్రసంశలు, అంతా విలువలే…!

-

ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీ 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు. పాత్రికేయ రంగంలో ఠీవిగా 13 వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటున్న యన్టీవీ కి శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయ విలువలను కాపాడుతూ ఎన్టీవీని ప్రజలంతా నాటీవీ అనుకునే విధంగా తీర్చిదిద్దిన అధినేత నరేంద్ర చౌదరి గారికి, పాత్రికేయులు, సిబ్బంది కి ప్రత్యేక అభినందనలని లోకేష్ అన్నారు.

Nara_Lokesh
Nara_Lokesh

అదే విధంగా కేవలం వార్తలే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలు, దైవం పట్ల విశ్వాసం పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని భాగస్వామ్యం చెయ్యడం ద్వారా ప్రజల మనస్సులో ఎన్టీవీ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని లోకేష్ తన ట్విట్టర్ లో చెప్పారు. అటు వైసీపీ నేతలు సైతం ఈ సంస్థకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news