హైకోర్టుకు వెళ్లనున్న పవన్… క్లారిటీ?

-

గమ్యం లేని ప్రయాణం ఎలా ఉంటుందో.. క్లారిటీ లేని పోరాటం అలానే ఉంటుంది అనడానికి కావాల్సినన్ని ఉదాహరణలు అమరావతి విషయంలో దొరుకుతున్నాయి! రైతులకు అన్యాయం జరగనివ్వం అని అంతా చెప్పేవారే కానీ… ఆ అన్యాయం ఏమిటి? వీళ్లు చేయబోయే న్యాయం ఏమిటి? అన్న విషయాలపై మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది! ఈ క్రమంలో పవన్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

అవును… రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ‌లో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు పార్టీ పెద్దలు! ప్రభుత్వాన్ని నమ్మి 28 వేల మందికి పైగా రైతులు 33 వేల ఎకరాల పంట భూములను రాజధాని కోసం ఇచ్చారు. ఆ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని చెబుతున్నారు జనసేన నేతలు. అంతవరకూ బాగానే ఉంది కానీ… క్లారిటీ మిస్ అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.

రాజధాని రైతులకు తాజాగా కౌలు చెల్లించింది ప్రభుత్వం! ఇంకా న్యాయం జరగాలి అని జనసేన అధినేత చెబుతున్నారు. అంటే రాజధాని మొత్తాన్ని అమరావతిలోనే ఉంచితే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పడం ఆ మాటల ఉద్దేశ్యమా… లేక మూడు రాజధానులకు అంగీకరిస్తూనే రైతులకు న్యాయం జరగలాలని కోరడమా? అదే నిజమైతే ఆ న్యాయం కౌలు కాకుండా మరేమిటి? రైతుల భూములు వెనక్కి ఇచ్చెయడమా… లేక ఆ భూములకు వారు ఆశించిన, ఊహించిన ధర చెల్లించడమా? పవన్ కి స్పష్టత ఉండాలని కోరుతున్నారు అమరావతి రైతులు!!

Read more RELATED
Recommended to you

Latest news