తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం కృష్ణ వరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను కసాయి తల్లి పూడ్చి పెట్టింది. అలా పూడ్చి పెట్టడం గమనించిన గ్రామస్థులు చిన్నారిని బయటకు తీశారు. పసి బాబు క్షేమంగా వున్నాడని తెలుస్తోంది. బిడ్డ బతికే ఉండటంతో లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి మెగుగైన వైద్యం కేసం భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ ఘటన మీద చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈలోపు పోలీసులకి ఉప్పందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రస్తుతం సమీప 5 గ్రామాలలో గర్భవతులు ఉండగా వారందరినీ వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. బిడ్డను పూడ్చిపెట్టిన వాళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డెలివరీ ఎవరు చేశారన్న అంశం మీద విచారణ జరుపుతున్నారు. అయితే ఇది ప్రీ మెచ్యూర్ డెలివరీ అని అధికారులు భావిస్తున్నారు.