రియా చక్ర‌వ‌ర్తికి మ‌ద్ద‌తుగా బి-టౌన్ సెల‌బ్రిటీల క్యాంపెయిన్

-

బాలీవుడ్ సెల‌బ్రిటీలు దియా మీర్జా, ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, విద్యాబాల‌న్, తాప్సీలు న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. సుశాంత్ కేసులో రియా నిర‌ప‌రాధి అని వారు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ మేర‌కు వారు రియా పోస్టుల‌ను షేర్ చేస్తున్నారు. రియా అరెస్టు అయిన‌ప్పుడు ధ‌రించిన టి-ష‌ర్టుపై ఉన్న వాక్యాల‌ను వారు షేర్ చేస్తూ రియాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

b-town celebrities launched campaign on social media to support rhea chakraborthy

రియా చక్ర‌వ‌ర్తిని మంగ‌ళ‌వారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొంత సేపు విచారించి అనంత‌రం ఆమెను అరెస్టు చేసింది. బుధ‌వారం ఆమెను ఎన్‌సీబీ ఆఫీస్ నుంచి జైలుకు త‌ర‌లించారు. అయితే ఆమెను అరెస్టు చేసిన‌ప్పుడు ఆమె ధరించి ఉన్న టి-ష‌ర్టుపై Roses are red, violets are blue, Let’s smash patriarchy, Me and you అనే వాక్యాలు ఉన్నాయి. వాటిని స‌ద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీలు షేర్ చేశారు. ఇక తాప్సీ అయితే.. సుశాంత్ బ‌తికి ఉంటే అత‌నూ ఇప్పుడు క‌ట‌క‌టాల వెనుక ఉండేవాడ‌ని కామెంట్ చేసింది.

కాగా ఆయా సెల‌బ్రిటీలకు వ్య‌తిరేకంగా సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. అందులో పైన తెలిపిన వాక్యాల‌ను ఆమె మార్చి పోస్టు పెట్టింది. Roses are red, violets are blue. Let’s fight for the right, me and you అని ఆమె పోస్టు పెట్టింది. కాగా మ‌రోవైపు ఎన్‌సీబీ అదుపులో ఉన్న రియా బాలీవుడ్ గురించి షాకింగ్ విష‌యాల‌ను చెప్పిన‌ట్లు తెలిసింది. బాలీవుడ్ లో 80 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని ఆమె చెప్పిన‌ట్లు తెలిసింది. దీంతో బాలీవుడ్‌లో ఈ విష‌యం క‌ల‌క‌లం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news