దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ కంపెనీలో చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ 10 శాతం వాటాను కలిగి ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలు పబ్లిష్ చేసిన పబ్‌జి గేమ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే తాము టెన్సెంట్ నుంచి విడిపోతున్నట్లు బ్లూ హోల్ ప్రకటించింది. కాగా ఇప్పుడు తాజాగా టెన్సెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం కలకలం రేపుతోంది.
పబ్‌జి గేమ్‌తో చైనాకు చెందిన టెన్సెంట్‌కు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ గేమ్‌ను బ్యాన్ చేశారు. అయితే మరోవైపు టెన్సెంట్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో తాజాగా 62.8 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. దీంతో ఈ విషయం వివాదాస్పదమవుతోంది. టెన్సెంట్‌తో సంబంధాలు ఉన్నాయని పబ్‌జి గేమ్‌ను బ్యాన్ చేశారు.. మరి టెన్సెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను కూడా బ్యాన్ చేస్తారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
చైనాతో తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ మాతృసంస్థ వాల్‌మార్ట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో 660.25 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. మొత్తం 1.2 బిలియన్ డాలర్లను ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని గతంలోనే వాల్‌మార్ట్ ప్రకటించింది. అందులో భాగంగానే పలు కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే టెన్సెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం, అందులోనూ ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.