కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన….!

-

వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ లభిస్తుందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు టీకాలు… మొదటి, రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్ దశకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు సామాజిక దూరాన్ని సామాజిక వ్యాక్సిన్‌ గా స్వీకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ,

వివిధ సంస్థలకు అవసరమైన అన్ని సహకారాలను ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధికి నిపుణుల కమిటీ కృషి చేస్తోందని అన్నారు. టీకా అభివృద్ధి దిశలో భారత్ డబ్ల్యూహెచ్‌ఓ, ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోందని ఆయన అన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో కరోనా యోధుల పాత్రను ప్రశంసించిన ఆయన, నిపుణుల సహాయంతో ప్రధాని ప్రతి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news